Tuesday, February 21, 2012

Nuvva Nena Teaser Released


'గమ్యం' తర్వాత అల్లరి నరేశ్, శర్వానంద్ నటిస్తున్న 'నువ్వా నేనా' చిత్రం టీజర్ ను వేలంటైన్ డే సందర్భంగా  దర్శక నిర్మాతలు విడుదల చేశారు. భీమ్స్ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో శ్రియ, విమలారామన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అల్లరి నరేశ్, శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చిన 'గమ్యం' చక్కటి విజయాన్ని సాధించింది. అయితే ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాలేదు. ఇప్పుడు యస్.వి.కె. మీడియా వీరిద్దరితో నారాయణను దర్శకునిగా పరిచయం చేస్తూ 'నువ్వా నేనా' అనే చిత్రాన్ని రూపొందిస్తోంది.
ఒక పాట మినహా 'నువ్వా నేనా' సినిమా మొత్తం పూర్తయింది. మిగిలిన ఈ పాటను ఈ నెల 20 నుండి 25 మధ్యలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమా ద్వారా భీమ్స్ సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మొత్తం 6 పాటలున్నాయి. ఆడియోను ఈ నెల 19న విడుదల చేసి సినిమాను మార్చి 1న విడుదల చేయాలన్నది తమ ప్లాన్ గా చెబుతున్నారు నిర్మాత వంశీ. 'గమ్యం' లాగే 'నువ్వా నేను' కూడా ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.


No comments:

Post a Comment

recomended

Search This Blog